Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page

శ్రీ స్వామివారు - హాటకేశ్వరం

ఈ పుస్తకము అట్టపై ఉన్న బొమ్మ శ్రీవారు శ్రీశైలంలో ఉన్నపుడు తీసినది. ఈ బొమ్మకథ ఒకటి వేరే ఉన్నది.

శంకరభగవత్పాదుల వారు కొన్ని శతాబ్దాల క్రితం దిగ్విజయం చేసిన సందర్భంలో శ్రీశైలంవచ్చి తపస్సు చేశారట. ఆ తపఃస్థలాన్ని శ్రీవారు ఈ చిత్తరువులో నిర్దేశిస్తున్నారు.

ఈ ఫోటోను నేను తీయటం ఒక చిన్న కథ. ఆ కథను చెప్పాలంటే నేను 1967వ సంవత్సరం మార్చిమాసానికి వెళ్ళాలి. ఆ శుభసమయంలో శ్రీవారి సమక్షంలో నేను ఉండటమే ఒక పెద్ద భాగ్యం.

ఆచార్యులవారు నవ¸°వనులా అంటే కాదు. ప్రాపంచిక దృష్టిలో ఏమన్నా రూపసియా అంటే అదీకాదు. మరి వీరి ఫోటోను నేను తీయాలని ఈ తహతహ నాకెందుకు?

ఈ ప్రశ్నలకు తృప్తికరంగా నేను జవాబు చెప్పలేను. కాని ఒక్క విషయం మాత్రం నిజం. శ్రీవారికి వారి చిత్తరువుల ఆల్బం సమర్పించిన ఒక్కొక్క సందర్భములోనూ అనిర్వచనీయమైన తృప్తిని మాత్రం అనుభవించినది నిజం.

ఐతే ఇక్కడ ఆత్మకథ చెప్పుకోవటం నా ఉద్దేశం కాదు. కంచిస్వాములవారు అంటేనే నాహృదయం స్పందిస్తుంది. కొన్ని ఏళ్ళక్రితం జరిగిన వృత్తాంతం శ్రీవారితో నా ప్రథమ సమావేశం జ్ఞప్తికి తెస్తున్నది.

మద్రాసు సమీపంలో వనగరం అనే చోట శ్రీవారు చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. ఆ రోజులలో మతానికి నేను ప్రతిద్వందిని. నకిలీ సాధువులే కాదు. అసలు మహానుభావులన్నా నాకు అగౌరవమే- ఏదో సంశయం. అందుచేత కంచి స్వాముల వారిని కలుసుకోవడానికి నేనుప్రత్యేకంగాఉత్సాహ పడలేదు. కాని మాతండ్రిగారు ఒకానొక సందేశాన్ని శ్రీవారి కందచేయాలన్న కార్యభారాన్ని నాపై పెట్టారు. అందుచేత శ్రీవారి వద్దకు వెళ్ళవలసి వచ్చింది.

నేను మఠానికి వెళ్ళి శ్రీవారిని చూడాలి అని చెప్పగా పరిచారకులు శ్రీహరి సమక్షానికి తీసుకొని వెళ్ళారు. చూడటానికి ముందు ఈ సన్యాసి ఎలా వుంటారో అని మనస్సులో ఊహించుకొన్నా నాఊహకు, అసలు మూర్తికీ అజగజాంత రంగా వున్నది. ఎక్కడా పోలికలేదు. వారినిచూచీ చూడటంతో నేను ఆశ్చర్యపోయాను. చిన్నవిగ్రహం, స్ఫుర ద్రూపం. ఒక మూల ముడుచుకొని కూచున్నారు. శిరస్సుపై తులసీ బిల్వమాలికలు. చుట్టూ చొక్కా లేకుండా తిరుగు తున్న ఆగంతుకులు.

శ్రీవారు నావేషాన్ని ఏదీ గమనించక దగ్గరకు వచ్చి కూచోమని సంజ్ఞ చేశారు. వచ్చిన కార్యమేమో చెప్పి, వారడిగిన ప్రశ్నలకు జవాబిచ్చి వారి సమక్షం నుంచి గబగబ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయే దానికిముందు కాస్త జాగ్రత్తగా వారి ముఖాన్ని పరిశీలించాను. విశాలమైన నుదురు. తీర్చి దిద్దిన త్రిపుండ్రరేఖలు. చిబుకంమీద తెల్లని గడ్డం. చెక్కి నట్లున్ననోరు. తేజఃపుంజములైన కళ్ళు. వారి చూపులో అవధిలేని ఆప్యాయత నాకు గోచరించింది.

ఆ ముగ్ధ ముఖారవిందాన్ని చూడగానే నాకొక ప్రీతి పుట్టింది. వారి పెదవులమీద మందహాసం ద్యోతన మయినపు డల్లా హృదయం ఒక మధురానుభూతితో నిండిపోయింది. ఆ స్నిగ్ధస్మితావలోకనంకోసం తరువాతి కాలంలో కాచుకొని కూచుంటానని అనుకొన్నానా? ఆ సన్యాసి ముఖంలో దీపించే హాసం ప్రపంచంలోని కష్టసుఖాలకు అతీతంగాఊహ కందనివిధంగా అగపడింది.

ఎక్స్‌ప్రెస్‌ పత్రికా సంస్థలో నాకు స్టాఫ్‌ఫోటోగ్రాఫర్‌ ఉద్యోగం. ప్రెస్‌వాళ్ళు స్వాములవారి పర్యటనకు నన్ను నియమించారు. ఈ ఉద్యోగనిర్వహణ అనుకోకుండా శ్రీవారి సామీప్యంలో ఉండే అవకాశం నాకు తెచ్చి పెట్టింది. అందుచేత వారి పాదయాత్రలో నేనూ అప్పడపుడూ పాల్గోనే వాడిని.

బ్రిటిష్‌ గ్రంథకర్త పాల్‌బ్రింటన్‌ 1931 లో చెంగల్పట్టులో శ్రీవారిని దర్శించి వారి ముఖంలో ఒక అనిర్వచనీయమైన శోభను గూర్చి వర్ణించారు. ఆ మాటను ఫ్రెంచి భాషలో యుక్తంగా ాూశషష| అని అంటారు.

ఈ గుణం వారి ముఖంలోనే కాదు- శరీరమంతా వ్యాపించిఉంది. పూజ చేస్తున్నపుడూ భక్తులతో ఇష్ఠాగోష్టి చేస్తున్నపుడు మౌనముద్రాంకితులైఉన్నపుడూ- అన్ని వేళలా ఒక అనిర్వచనీయ ఆధ్యాత్మిక ప్రాచుర్యం వారిలో పులుము కొని వున్నట్లు కనిపించేది. ప్రజ్ఞానఘనంగా కనబడే ఈ వెలుగును నా చిత్తరువులలో ఏలా నిబద్ధం చేయను? ఆయన సమక్షంలో నాకు కలిగే ఈ ఆనందోల్లాసం నాచిత్తరువులలో ప్రతిబింబించాలని ప్రయత్న పడేవాడిని. ఎంతవరకునేను కృతకృత్యుణ్ణయ్యానో నాకు తెలియదు.

శంకరుల ద్వాదశలింగస్తోత్రంలో శ్రీశైల ప్రసక్తి వస్తుంది. శివానందలహరిలో శ్రీశైల ప్రశంస ఉన్నది. అందుచేత వారు ఈ క్షేత్రానికి నిస్సంశయంగావచ్చారని స్థిర మౌతుంది.

శ్రీవారు శ్రీశైలంలోఉన్నపుడు పండితులతో కలసి హాటకేశ్వరం వెళ్ళారు. మల్లికార్జున ఆలయానికి కొన్ని మైళ్ళ దూరంలో ఈ ప్రదేశమున్నది. శ్రీవారు ఒక లోయలో ప్రవేశించి అక్కడవున్న ఒక పెద్దవృక్షం క్రింద ఉన్న బండపై చతికిలబడ్డారు. ఆ రమణీయ స్థలంలో శ్రీవారు సూత్ర భాష్య పాఠం చెప్పడానికి ప్రారంభించారట. ఈ మాట విన్నపుడు ఇంత మంచి సన్నివేశంలో నేను ఉండలేక పోయానే అని విచారం వేసింది.

ఈ విషయంలో ముఖ్యం భాష్య పాఠ ప్రవచనమొకటే కాదు; మరొకటి కూడ ఉన్నది. ఆది శంకరులు శ్రీశైలంలో ఏచోట తపస్సు చేశారో శ్రీవారు నిర్దేశించి చూపి భగవత్పాదులవారి పాదములను అక్కడ శిలాఫలకంపై చెక్కింప చేశారట. ఇది వినగానే ఎంత మంచి అవకాశం జారవిడచు కొన్నాను? అని అనుకొన్నాను.

ఈ సంగతి జరిగిన కొన్నాళ్ళకు శ్రీవారి దర్శనార్ధం నేను శ్రీశైలం వెళ్ళాను, ఉదయం నాలుగు గంటలకు సాధారణంగా శ్రీవారిని దర్శించేది నాకు అలవాటు. అపుడు దర్శనార్ధమై వచ్చే జనం తక్కువ. ఒకరోజు ఉదయం నేను వెళ్ళగానే శ్రీవారు ఎక్కడకో వెళ్ళడానికి సన్నాహంలో వున్నారు. మఠంలో అందరూ నిద్రపోతున్నారు. శ్రీవారి వద్ద ఒకరిద్దరు పరిచారకులు మాత్రమున్నారు. శ్రీవారు ఎక్కడకు వెడుతున్నారో తెలియని దానివల్ల మాఆదుర్దా హెచ్చైనది. దేనికైనా మంచిదని నాకెమరాను సిద్ధం చేసుకొని తయారుగా వున్నాను.

శ్రీవారు మెల్లగా నడుస్తూ ఒక గంటసేపటికి హాటకేశ్వరంలోని శివాలయం చేరుకొన్నారు. ప్రక్కనే ఉన్న జలాశయం వద్ద కూర్చుని మండలీక వెంకటశాస్త్రిగారితో సంస్కృతంలో సంభాషించడానికి ప్రారంభించారు. కొంతసేపటికి మఠనిర్వహణనుంచీ పూర్తిగా విరమించాలని, తాను చేసిన తీర్మానంగూర్చి వారు చర్చిస్తున్నట్లు తెలిసింది. తాము ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండి పోవాలన్న కోరికా వెలిబుచ్చారు. ఆంధ్రదేశపర్యటన శ్రీజ యేంద్ర సరస్వతులవారు చేసేటట్లు, తానేమో పూర్తిగా మఠ కార్యక్రమం నుంచీ వైతొలగి శ్రీశైలంలో స్థిరపడేటట్లు శ్రీవారు మాట్లాడు తున్నారు. మేమందరమూ ఏమిచేయడమా అని సంభ్రమంలో ఉన్నాం.

కొందరు శ్రీవారి నిశ్చయాన్ని విని దుఃఖించారు. ఈ విషయం జయేంద్రులవారికి తెలియజేయడ మెట్లు? నేను సాక్షిగా ఉన్నా నాకేమీ సంబంధం లేని వాడిలా ఉండలేక పోయాను.

వీళ్ళందరూ ఇట్లా విచార సముద్రంలో మునిగి యుండగా శ్రీవారిని ఫోటో తీయాలన్న కోరిక నాకు మళ్ళా చిగిరించ సాగింది. కాని దానికి ఇది సమయం కాదు. పదవీ విరమణ యోచనలో శ్రీవారు ఉంటే మీ ఫోటోను తీస్తానని వారికి చెప్పటం భావ్యంగా తోచలేదు.

ఈవిధంగా వీళ్ళు ముందువెనుక లాడుతుంటేశ్రీవారు జలాశయంలో స్నానం చేసి తమనిష్ఠలో ఉన్నారు. ఒకగంట సేపటికి వారి అనుష్ఠానంపూర్తిఅయినది. తర్వాత నెమ్మదిగా లేచి ఆదిశంకరుల తపఃస్థలానికి దారితీశారు.

నేను వారివెంట పరుగెత్తసాగాను. ఇంతకంటే మంచి సమయము దొరకదని వారు ఆచోటునుంచి కదలక ముందే ఫోటో ఏలాగైనా తీసే ప్రయత్నంలోనేను ఉన్నాను. శ్రీవారు నిదానంగా చెట్టుక్రిందనిలుచునిభక్తులతో మాట్లాడుతున్నారు. బహుశా నాకు తగినంత అవకాశం ఇవ్వాలనేమో? దీనిని చూచి నేను అవసరపడక నిదానంగా ఫోటోలు తీశాను. నాపని పూర్తిఐనదని చెప్పినంతవఱకూ శ్రీవారు ఆ చోటునుండే కదలలేదు. తర్వాత శ్రీ జయేంద్ర సరస్వతులవారూ ఇంకా ఇతరులూ శ్రీవారిని వారి నిశ్చయాన్ని మార్చుకో వలసిన దని వేడుకోడానికి హాటకేశ్వరానికి వచ్చారు. కాని వారి నిశ్చయాన్ని మార్చటం అంత సులభమా?

ఎంతోమంది బ్రతిమాలిన పిదప వారి ఉద్దేశాన్ని మార్చుకొని ఆంధ్రదేశ పర్యటనం పూర్తి చేశారు. ఆంధ్ర దేశంలో ఎన్నో నగరాలకు విజయం చేశారు. కాని శ్రీశైలంలో ఉన్నన్నాళ్ళూ ఆదిశంకరుల తపఃస్థానానికిఅడుగడుక్కూ వెళ్ళేవారు. ఆదిశంకరుల సహస్రనామావళిలో ఒకనామం- శ్రీశైల గమనోత్సుక:- అని వారికి శ్రీశైలం వెళ్ళడమంటే బలేహుషారట! వారి పరంపరకు చెందిన శ్రీమచ్చంద్రశేఖర యతీంద్రులకూ శ్రీశైలం అంటే అభిమానమూ ఆచోటనే ఉండిపోదామన్నసంకల్పమూకలిగిందంటే ఆశ్చర్యమేముంది?

ఆంగ్లము : నీలంరాజు మురళీధర్‌,

(ఆంగ్లమునకు అనుకృతి - విశాఖ)


Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page